Telugu

మనదేశంలో ఎక్కువగా బంగారం కొనే రాష్ట్రం ఇదే

Telugu

బంగారం పెట్టుబడిగా

మనదేశధంలో బంగారం కేవలం పెట్టుబడి కాదు..  మన సంప్రదాయం, సంస్కృతిలో భాగం.   ప్రపంచంలోనే బంగారాన్ని ఎక్కువగా వినియోగించే రెండో అతిపెద్ద దేశం మనదే.

Image credits: CHAT GPT
Telugu

మన రాష్ట్రాలదే హవా

దేశం మొత్తం మీద బంగారానికి డిమాండ్ ఉన్నా కూడా.. దాదాపు 40 శాతం వాటా దక్షిణ భారతదేశానిదే. ఇక్కడ 22 క్యారెట్ల బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంది.

Image credits: Freepik
Telugu

ఏ రాష్ట్రం నెంబర్ 1?

భారత్‌లో బంగారం వాడకంలో కేరళ మొదటి స్థానంలో ఉంది. దేశం మొత్తం బంగారం డిమాండ్‌లో దాదాపు 20శాతం వాటా ఒక్క కేరళ రాష్ట్రానిదే.

Image credits: Freepik
Telugu

గల్ఫ్ దేశాల పాత్ర

కేరళలో బంగారం డిమాండ్ పెరగడానికి గల్ఫ్ దేశాల నుంచి వచ్చే రెమిటెన్స్ ప్రధాన కారణం. అలాగే కొచ్చి పోర్ట్ నుంచి దిగుమతి సులభంగా అవుతుంది.

Image credits: Freepik
Telugu

తమిళనాడు, ఏపీలోనూ...

కేరళ తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా బంగారంపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.

Image credits: Freepik
Telugu

బంగారం ఉత్పత్తిలో కర్ణాటక టాప్

బంగారం కొనడంలో కేరళ ముందుంటే, బంగారం ఉత్పత్తిలో మాత్రం కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. దేశానికి అవసరమైన బంగారంలో ఎక్కువ భాగం హట్టి, KGF గనుల నుంచే వస్తుంది.

Image credits: Freepik
Telugu

గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువ

మనదేశంలో మొత్తం బంగారం డిమాండ్‌లో 55  శాతం కంటే ఎక్కువ గ్రామీణ ప్రాంతాల వారే కొంటున్నారు. పెళ్లిళ్లకు బంగారం అధికంగా కొంటున్నారు.

Image credits: Freepik
Telugu

బంగారం కొనేది మిడిల్ క్లాసే

భారత్‌లో మిడిల్ క్లాస్ వర్గానికి చెందిన వారే ఎక్కువ.  మొత్తం బంగారం డిమాండ్‌లో 50 శాతం కంటే ఎక్కువ కొనుగోలు వారే చేస్తున్నారు. 

Image credits: Freepik

Paayal Chokers: ఆఫీస్ పార్టీలో అదిరిపోవాలంటే.. ఈ 6 పాయల్ చోకర్స్ ట్రై చేయండి

Saree Hack:చీర పర్ఫెక్ట్ గా కట్టుకోవాలా? ఈ ఒక్క ట్రిక్ ఫాలో అయితే చాలు

Tea: హోటల్ టీ అంత రుచిగా ఎందుకుంటుందో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే!

Mixer Grinder: మిక్సీని 3 నిమిషాల కంటే ఎక్కువ వాడితే ఏమవుతుందో తెలుసా?