నిమ్మకాయలను తాజాగా ఉంచాలంటే ఫ్రిజ్ లో పెడితే సరిపోదు. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు.
Image credits: AI Meta
Telugu
నూనె రాసి
నిమ్మకాయల్ని తడిలేకుండా తుడిచి వాటిపై మూడు నాలుగు చుక్కల వంట నూనె రాయాలి. గాలి చేరని డబ్బాలో పెట్టి మూత పెట్టేయాలి. ఆ డబ్బాను ఫ్రిజ్ లో పెట్టేస్తే సరి.
Image credits: AI Meta
Telugu
నీళ్లలో వేసి
ఒక గాజు సీసాలో సగం వరకు నీళ్లు నింపండి. ఆ తర్వాత అందులో నిమ్మకాయలు వేసి, మూత గట్టిగా పెట్టి ఫ్రిజ్‌లో స్టోర్ చేయండి. ఇలా కూడా నిల్వ ఉంటాయి.
Image credits: AI Meta
Telugu
న్యూస్ పేపర్లో..
నిమ్మకాయల్ని న్యూస్‌పేపర్‌లో చుట్టాలి. ఇలా చేస్తే 15 రోజుల వరకు నిమ్మకాయలు అస్సలు ఎండిపోవు.
Image credits: AI Meta
Telugu
నిమ్మరసం తీసి
నిమ్మకాయల కన్నా నిమ్మరసం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కాబట్టి నిమ్మరసాన్ని తీసి ఒక బాటిల్ లో వేసి ఫ్రిజ్ లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు.
Image credits: AI Meta
Telugu
ఐస్ క్యూబ్ ట్రేలో
నిమ్మరసాన్ని తీసి ఐస్ క్యూబ్ ట్రేలో వేేసి ఐస్ ముక్కలుగా మార్చి ఎక్కువ రోజులు నిల్వ చేయవచ్చు. ఇలా మూడు నెలల పాటూ నిల్వ చేయవచ్చు.
Image credits: Getty
Telugu
కట్ చేసిన నిమ్మకాయలు
కట్ చేసిన నిమ్మకాయలకు ప్లాస్టిక్ ర్యాప్ చుట్టి ఫ్రిజ్ లో పెట్టినా ఎక్కువ నెలల పాటూ నిల్వ ఉంటాయి.