ఇలా ఉంటే అస్సలు కొనొద్దు..ఫ్రెష్ కాలీఫ్లవర్ గుర్తుపట్టడం ఎలా?
food-life May 02 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
కాలీఫ్లవర్ కొనేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి
కాలీఫ్లవర్ కర్రీ చాలామందికి ఇష్టం. కానీ దాన్ని కొనడం, వండటం ఒక పెద్ద టాస్క్. పురుగులు లేకుండా ఫ్రెష్‌గా ఉండే కాలీఫ్లవర్‌ను ఎలా ఎంచుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
Image credits: AI and Gemini
Telugu
కాలీఫ్లవర్
కాలీఫ్లవర్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే, వాటిలో పురుగులు చేరే ప్రమాదం ఉంది. అందుకే మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే వండేయటం మంచిది. సీజన్ కాదు కాబట్టి స్టాక్ పెట్టుకోకండి.
Image credits: AI and Gemini
Telugu
రుచికరమైన వంటకాలు
కాలీఫ్లవర్‌తో రుచికరమైన కూరలు, గోబీ మంచూరియన్ వంటి ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఈ కూరగాయ ఏ వంటకంలోనైనా ఇట్టే కలిసిపోతుంది.
Image credits: AI and Gemini
Telugu
కాలీఫ్లవర్ కొనేటప్పుడు ఏం చేయాలి?
కాలీఫ్లవర్ పైభాగం పసుపు రంగులోకి మారితే దాన్ని కొనకండి. పసుపు రంగులోకి మారిందంటే, దాన్ని కోసి నాలుగు, ఐదు రోజులు అయ్యిందని అర్థం.
Image credits: AI and Gemini
Telugu
రంగు చూసి కొనండి
కాలీఫ్లవర్ పువ్వు రంగు శుభ్రంగా, తెల్లగా ఉండాలి. తెల్లగా ఉంటే అది ఫ్రెష్ కూరగాయ అని అర్థం. అలాగే, పువ్వు రెమ్మలను కొద్దిగా విడదీసి పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూడండి.
Image credits: AI and Gemini
Telugu
వండటానికి ముందు ఇలా చేయండి
కాలీఫ్లవర్‌ను ముక్కలుగా చేశాక, వేడి నీటిలో బాగా కడగాలి. ఆ తర్వాత, నీరు ఆవిరయ్యాక, 5-10 నిమిషాల పాటు తక్కువ మంటపై వేయించి, మీకు నచ్చిన వంటకం చేసుకుంటే రుచి అదిరిపోతుంది.