Telugu

అమ్మాయిలు వేసుకునే కుర్తా, కుర్తీకి మధ్య తేడా ఇదే

Telugu

కుర్తా, కుర్తీకి తేడా ఏంటి?

అమ్మాయిలు వేసుకునే డ్రెస్సుల్లో కుర్తీ డిజైన్లు, కుర్తా సెట్లు రెండూ ఫేమసే. చాలామంది ఈ రెండూ ఒకటే అనుకుంటారు. కానీ ఈ రెండింటికీ మధ్య తేడా ఉంది.

Image credits: instagram
Telugu

కుర్తా అంటే ఏమిటి?

కుర్తాను ఆడవాళ్లతో పాటూ మగవాళ్లు కూడా ధరిస్తారు. ఇది సాధారణంగా చాలా పొడవుగా, మోకాళ్ల కిందకు వస్తుంది. దీన్ని చూడీదార్, లెగ్గింగ్, పలాజో, సల్వార్ లేదా జీన్స్‌తో జత చేసి వేసుకోవచ్చు.

Image credits: instagram
Telugu

కుర్తీ అంటే ఏమిటి?

కుర్తీ అనేది పొడవు తక్కువగా, బాడీకి ఫిట్‌గా ఉంటుంది. వీటిని ఎక్కువగా జీన్స్, స్కర్ట్స్‌తో వేసుకుంటారు. కుర్తాలతో పోలిస్తే ఇవి తక్కువ ధరకే దొరుకుతాయి.

Image credits: pinterest
Telugu

కుర్తా ఎక్కడ వేసుకుంటారు?

కుర్తాను రోజూ వేసుకోవడంతో పాటు పెళ్లిళ్లు, పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లోనూ ఎంచుకోవచ్చు. ఎంబ్రాయిడరీ, ప్రింట్లు, రకరకాల ఫ్యాబ్రిక్‌లపై వేలకొద్దీ డిజైన్లు లభిస్తాయి. 

Image credits: instagram/nidhi
Telugu

కుర్తీ ఎక్కడ వేసుకుంటారు?

కుర్తాలాగా కుర్తీలపై హెవీ వర్క్  ఉండదు. ఇవి కాలేజీ, ఆఫీస్ లకు వేసుకుంటారు. ఇప్పటి యువతరం వీటిని ఎక్కువగా ఇష్టపడుతోంది.

Image credits: Pinterest
Telugu

వీటి మధ్య ప్రధాన తేడాలు

కుర్తా పొడవుగా, కుర్తీ పొట్టిగా ఉంటుంది. కుర్తా వదులుగా, కుర్తీ టైట్‌గా ఉంటుంది.

Image credits: instagram
Telugu

కుర్తా చరిత్ర

కుర్తాకు చాలా పాత చరిత్ర ఉంది. ఇది పర్షియా నుంచి భారతదేశానికి వచ్చిందని చెప్పుకుంటారు. మొదట్లో దీన్ని మగవాళ్లు వేసుకునేవారు . కానీ ఇప్పుడు ఆడవాళ్లు వేసుకుంటున్నారు. 

Image credits: pinterest

Readymade Saree: ఈ రెడీమేడ్ చీరలను రెండు నిమిషాల్లో కట్టేసుకోవచ్చు

Cotton Suits:సమ్మర్ కి కంఫర్ట్ ఇచ్చే ట్రెండీ కాటన్ డ్రెస్సులు

Gold Chain: క్యూట్ డిజైన్ లో బంగారు చైన్.. వెయిట్ కూడా తక్కువే!

ఏమిటీ.. రూ.3 లక్షల కోట్ల ఆస్తిపాస్తులున్న ఈమెకు ప్రభుత్వ పెన్షనా..!