భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన సావిత్రి జిందాల్ నికర ఆస్తి విలువ సుమారు $39 బిలియన్లు. అంటే మన కరెన్సీలో దాదాపు ₹3.25 లక్షల కోట్లు. అయినా ఆమె చాలా సింపుల్ లైఫ్‌స్టైల్ పాటిస్తారు.
సావిత్రి జిందాల్ ఎప్పుడూ తెలుపు లేదా లేత రంగుల్లో ఉండే సింపుల్ కాటన్ చీరల్లోనే కనిపిస్తారు. ఆమెకు విదేశీ డిజైనర్ బట్టల మీద మోజు లేదు. ఖరీదైన ఆభరణాలు కూడా ధరించరు.
వేలకోట్లకు అధిపతి అయిన జిందాల్ పక్కా రూల్స్ పాటిస్తారు. హర్యానా ప్రభుత్వంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసినందుకు ఆమెకు నెలకు రూ.90000 పెన్షన్ వస్తుంది. దాన్ని ఆమె తీసుకుంటారు.
సావిత్రి జిందాల్ సాధారణ కార్లనే వాడతారు. ఆమెకు లైమ్‌లైట్, గందరగోళంగా ఉండే పార్టీలంటే ఇష్టం ఉండదు. తన సమయాన్ని ఎక్కువగా కుటుంబం, సామాజిక కార్యక్రమాలకే కేటాయిస్తారు.
భర్త ఓం ప్రకాశ్ జిందాల్ మరణం తర్వాత వ్యాపార పగ్గాలు చేపట్టారు. 9 మంది పిల్లల బాధ్యతను చూసుకుంటూనే జిందాల్ గ్రూప్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు.
సావిత్రి జిందాల్ కుటుంబం ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో నివసిస్తుంది. దక్షిణ ముంబైలోని వాల్కేశ్వర్‌లో వారికి 'జిందాల్ హౌస్' ఉంది. రూ.500 కోట్ల విలువైన మహేశ్వరి హౌస్ బంగ్లా ఉంది.
సావిత్రి జిందాల్ రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో చాలా పెద్దది. ఢిల్లీలోని ల్యూటియన్స్ జోన్‌లో ఆమెకు రూ.150 కోట్ల విలువైన బంగ్లాలు ఉన్నాయి. హిసార్‌లో 3 ఎకరాల్లో పూర్వీకుల ఇల్లు ఉంది.
సావిత్రి జిందాల్ భారత సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. భారతీయ కళలు, జానపద సంప్రదాయాలను ప్రోత్సహించే ప్రాజెక్టులపై ఎక్కువగా పనిచేస్తారు.