Lifestyle
ప్రస్తుత కాలంలో చాలా మంది ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇవి రోగాలే కావు. కానీ ఇవి ఎన్నో ప్రమాదకరమైన రోగాల బారిన పడేస్తాయి.
మీ శరీర బరువు పెరుగుతుంటే మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. అలాగే హెల్తీ ఫుడ్ నే తీసుకోవాలి. లేదంటే మీ శరీర బరువు విపరీతంగా పెరిగిపోతుంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల జ్యూస్ లను తాగితే కూడా శరీరంలో ఉన్న అదనపు కొవ్వు ఇట్టే కరుగుతుంది. అవేంటంటే?
కీరదోసకాయ జ్యూస్ మనల్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే ఇది చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.
బీట్ రూట్ జ్యూస్ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ బీట్ రూట్ జ్యూస్ ను తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడం స్టార్ట్ అవుతుంది.
క్యారెట్ లు కంటికి మేలు చేయడమే కాదు మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రెగ్యలర్ గా క్యారెట్ జ్యూస్ ను తాగితే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
లెమన్ వాటర్ ను తాగినా కూడా బెల్లీ ఫ్యాట్ తొందరగా కరుగుతుంది. ఇందుకోసం ప్రతిరోజూ ఉదయం పూట పరగడుపున గోరువెచ్చని నిమ్మరసాన్ని తాగాలి.
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరి జ్యూస్ కూడా బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ కరగడానికి సహాయపడుతుంది. ఉసిరి జ్యూస్ ను తాగితే శరీరంలోని అదనపు కొవ్వు తగ్గుతుంది.