Lifestyle

బీపీ పెరగొద్దంటే?

Image credits: Getty

అధిక రక్తపోటు

ప్రస్తుత కాలంలో చిన్న వయసు వారు కూడా హైబీపీతో బాధపడుతున్నారు. అయితే కొందరిలో అకస్మాత్తుగా బీపీ పెరిగిపోతూ ఉంటుంది. దీనికి ఎన్నో కారణాలున్నాయి. 

Image credits: Getty

ఉప్పు

ఉప్పు ఫుడ్ రుచిని పెంచుతుంది. కానీ దీన్ని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ముఖ్యంగా హైబీపీ పేషెంట్లు ఉప్పును తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది బీపీని పెంచుతుంది. 
 

Image credits: Getty

వ్యాయామం

అధిక రక్తపోటుతో బాధపడేవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఫిట్ గా ఉంచడమే కాకుండా రక్తపోటును కూడా అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. 

Image credits: Getty

స్మోకింగ్

 స్మోకింగ్ ఎన్నో రకాల క్యాన్సర్ల కు దారితీస్తుంది. అంతేకాదు ఇది కూడా మీ బీపీని అమాంతం పెంచుతుంది. అలాగే రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ అలవాటును మానుకోవాలి. 
 

 

Image credits: Getty

ఆల్కహాల్

ఆల్కహాల్ కూడా ఎన్నో రోగాలకు దారితీస్తుంది. అంతేకాదు మందును తాగడం వల్ల కూడా రక్తపోటు పెరుగుతుంది. అందుకే హైబీపీ పేషెంట్లు మందు అలవాటును మానేయాలి. 
 

Image credits: Getty

అధిక బరువు

అధిక బరువు రోగం కాదు. కానీ ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది. ఇది మీ రక్తనాళాలను దెబ్బతీయడమే కాకుండా రక్తపోటును కూడా పెంచుతుంది. అందుకే బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి. 
 

Image credits: Getty

ఈ ఆకులు మధుమేహులకు ఓ వరం..! ఎందుకంటే?

రాత్రిపూట ఈ ఆహారాలను ఎట్టి పరిస్థితిలో తినకండి.. ఎందుకంటే?

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఖచ్చితంగా తినాల్సిన ఆహారాలు ఇవి..!

చలికాలంలో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పకుండా తినండి