బ్రేక్ ఫాస్ట్, లంచ్ ఎంత మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో డిన్నర్ కూడా అంతే ముఖ్యం. కానీ నైట్ టైం ఏవి పడితే అవి తినకూడదు. లేదంటే ఆరోగ్యం పాడవుతుంది. ఇంతకీ రాత్రిళ్లు ఎలాంటివి తినకూడదంటే?
Image credits: Getty
పాస్తా
పాస్తా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే చాలా మంది దీన్ని రాత్రి కూడా తింటుంటారు. కానీ పాస్తాలో ఉండే కార్బోహైడ్రేట్లు కొవ్వుగా మారుతాయి. ఇది ఊబకాయానికి దారితీస్తుంది.
Image credits: Getty
నూడుల్స్
చాలా మంది రాత్రిపూటే నూడుల్స్ వంటి ఆహారాలను ఎక్కువగా తింటుంటారు. కానీ ఇలాంటి ఆహారాలను రాత్రిళ్లు అస్సలు తినకూడదంటున్నారు నిపుణులు.
Image credits: Getty
ఐస్ క్రీమ్
ఐస్ క్రీంను ఇష్టపడనివారు అస్సలు ఉండరు. చల్లని వెదర్ లో కూడా వీటిని లాగిస్తుంటారు. ఎంత ఇష్టమున్నా వీటిని రాత్రిపూట అస్సలు తినకూడదు.
Image credits: Getty
పిజ్జా, బర్గర్
రాత్రిపూట పిజ్జాలు, బర్గర్లు వంటి ఆహార పదార్థాలను అసలే తినకూడదంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే వీటిని రాత్రిపూట తింటే గుండెల్లో మంట వస్తుంది.
Image credits: Getty
కెఫిన్
కెఫీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్లను కూడా రాత్రిపూట అసలే తినకూడదు. ఎందుకంటే ఇవి మీ బరువును అమాంతం పెంచుతాయి కాబట్టి.