Lifestyle

ఓట్ మీల్

ఓట్ మీల్  మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో ఫైబర్ తో పాటుగా ఇతర ముఖ్యమైన పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. 
 

Image credits: Getty

గుడ్డు

గుడ్లు పోషకాల భాండాగారం. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఉదయం పూట రోజూ ఒక గుడ్డును తింటే మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. 
 

Image credits: Getty

బెర్రీలు

బెర్రీలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండే బెర్రీలను కూడా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తినొచ్చు. 
 

Image credits: Getty

అవొకాడో

అవొకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటుగా, విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఉదయం అవొకాడోలను తినడం వల్ల మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. 
 

Image credits: Getty

బచ్చలికూర

బచ్చలికూర లో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఐరన్, ఇతర విటమిన్లు సమృద్ధిగా ఉండే బచ్చలికూరను  ఉదయాన్నే తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. 
 

Image credits: Getty

బాదం పప్పు

రోజూ గుప్పెడు బాదం పప్పులను తినడం వల్ల మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. విటమిన్లు, రకరకాల పోషకాలు పుష్కలంగా ఉండే బాదం పప్పులను కూడా ఉదయాన్నే తినొచ్చు. 
 

Image credits: Getty

చియా విత్తనాలు

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండే చియా విత్తనాలను ఉదయాన్నే తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. అలాగే మీరు ఆరోగ్యంగా ఉంటారు. 
 

Image credits: Getty

చలికాలంలో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పకుండా తినండి

ప్రతిరోజూ ఓట్స్ ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

వీటిని తింటే మేకప్ వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు తెలుసా?

పెసర్లతో ఇన్ని లాభాలా?