Lifestyle
అరటి పండ్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు మలబద్దకం నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతుంది. ఈ పండు తక్షణ శక్తిని కూడా అందిస్తుంది.
ఆరెండ్ పండ్లు ఏ సీజన్ లోనైనా దొరుకుతాయి. ఈ పండ్లలో కూడా ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కివి పండ్లు కూడా మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. పండ్లలో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పండు హైడ్రేషన్ మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఆపిల్ పండ్లు కూడా సీజన్ తో సంబంధం లేకుండా దొరుకుతాయి. యాపిల్స్ ను తింటే మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
బొప్పాయి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. జీర్ణక్రియ సులభతరం చేయడానికి, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడానికి బొప్పాయి బాగా సహాయపడుతుంది.
ఫైబర్ కంటెంట్ కు గొప్ప మూలం అంత్తి పండ్లు. అత్తి పండ్లను తిన్నా మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.