ఈ సూపర్ ఫుడ్స్ ఫ్యాటీ లివర్ వ్యాధి రిస్క్ ను తగ్గిస్తాయి
life Jul 09 2023
Author: Mahesh Rajamoni Image Credits:Getty
Telugu
ఓట్స్
ఓట్స్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఓట్స్ బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
అవొకాడో
అవొకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కాలెయ పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తాయి. నిజానికి అవొకాడోలో ఎన్నో పోషకాలుంటాయి.
Image credits: Getty
Telugu
చేపలు
సార్డినెస్, ట్యూనా వంటి చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో కొవ్వు స్థాయిని తగ్గించడానికి సహాయపడతాయి. చేపలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
Image credits: Getty
Telugu
సోయా
సోయా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది.
Image credits: Getty
Telugu
గ్రీన్ టీ
గ్రీన్ టీ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి కూడా ఇది సహాయపడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
Image credits: Getty
Telugu
కాఫీ
కాఫీలో కూడా మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉంటాయి. కాఫీలో ఉండే కెఫిన్ కాలెయాన్ని రక్షిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.