Lifestyle

నల్లటి వలయాలను సహజంగా పోగొట్టడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్

Image credits: Freepik

కోల్డ్ కంప్రెసెస్

కోల్డ్ కంప్రెస్‌లను ఉపయోగించడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. నిజానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. చల్లదనం రక్త నాళాలను సంకోచించడానికి సహాయపడుతుంది. 

Image credits: Freepik

తగినంత నిద్ర లేకపోవడం, హైడ్రేషన్

నిద్ర లేకపోవడం వల్ల రక్తనాళాలు విస్తరిస్తాయి. దీంతో కళ్ల కింద వాపు వస్తుంది. అలాగే నల్లటి వలయాలు ఏర్పడుతాయి. అందుకే ప్రతి రాత్రి 7-8 గంటలు గాఢంగా నిద్రపోవాలి. 
 

Image credits: Freepik

బంగాళదుంప ముక్కలు

బంగాళాదుంపను సన్నని ముక్కలుగా కట్ చేసి కాసేపే ఫ్రిజ్ లో ఉంచి మీ కళ్లపై సుమారు 15 నిమిషాలు ఉంచండి. బంగాళాదుంప ముక్కలు నల్లటి వలయాలను తగ్గించడానికి, వాపును తగ్గించడానికి సహాయపడతాయి.

Image credits: Freepik

ఆల్మండ్ ఆయిల్

పడుకునే ముందు కొన్ని చుక్కల స్వచ్ఛమైన బాదం నూనెను డార్క్ సర్కిల్స్ పై అప్లై చేయండి. అలాగే కళ్లపై సున్నితంగా మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం నీటితో శుభ్రం చేయండి. 
 

Image credits: Freepik

దోసకాయ ముక్కలు

దోసకాయ ముక్కలు అలసిపోయిన కళ్లను రిఫ్రెష్ చేయడానికి, ఉబ్బును, నల్లటి వలయాలను తగ్గించడానికి సహాయపడతాయి. వీటిని కాసేపు ఫ్రిజ్ లో ఉంచి 10-15 నిమిషాలు కళ్లపై ఉంచండి.
 

Image credits: Freepik

టీ బ్యాగులు

గ్రీన్ టీ, చామంతి టీ బ్యాగ్‌లు రెండూ డార్క్ సర్కిల్‌లను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. రెండు టీ బ్యాగ్‌లను వేడి నీటిలో ఉంచిన తర్వాత వాటిని కాసేపు ఫ్రిజ్ లో ఉంచి కళ్లపై పెట్టుకోండి.
 

Image credits: Freepik

ఫ్యాటీ లివర్ వ్యాధి రావొద్దంటే..!

నోట్లో చెడు వాసన ఇందుకే వస్తుంది

ఇలా చేస్తేనే దంతాలు పచ్చగా అవుతాయి

తెల్ల జుట్టును నల్లగా చేసే ఎఫెక్టీవ్ చిట్కాలు మీకోసం