నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి సరైన ఆహారాలనే తినాలి. ముఖ్యంగా వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి ఘాటైన వాసన, రుచి ఉన్న ఆహారాల వల్ల నోట్లో నుంచి చెడు వాసన వస్తుంది.
Image credits: Getty
Telugu
స్మోకింగ్, ఆల్కహాల్
నోటిని లేదా శరీరంలోని ఇతర భాగాలను ప్రభావితం చేసే ఎన్నో వ్యాధుల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. అలాగే ధూమపానం, మద్యపానం కూడా నోటి దుర్వాసనకు కారణమవుతాయి.
Image credits: Getty
Telugu
దంత క్షయం
దంత క్షయం, చిగుళ్ల నొప్పులు, చిగుళ్ల పుండ్లు, నాలుకను ప్రభావితం చేసే అచ్చు ఇన్ఫెక్షన్లు, నోటి పూతలు, గాయాలు అన్నీ నోటి దుర్వాసనకు కారణమవుతాయి.
Image credits: Getty
Telugu
బ్రష్
మీరు రెగ్యులర్ గా మీ దంతాలను బ్రష్ చేయకపోయినా లేదా మీ నాలుకను సరిగ్గా క్లీన్ చేయకపోయినా కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది.
Image credits: Getty
Telugu
యాలకులు
భోజనం చేసిన తర్వాత ఒకటి లేదా రెండు యాలకులను నోట్లో వేసుకుని నమలడం వల్ల కూడా నోటి దుర్వాసన తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
Image credits: Getty
Telugu
లవంగాలు
లవంగాల్లో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. అందుకే భోజనం చేసిన తర్వాత లవంగాలను నమలడం వల్ల కూడా నోటి దుర్వాసన తగ్గిపోతుంది.