Lifestyle
ఉసిరి రసంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి.ఈ రసం జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు పెరిగేందుకు సహాయపడుతుంది.
బచ్చలికూరలో ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ బచ్చలికూర రసం తలకు రక్త ప్రసరణను పెంచుతుంది. జుట్టు పెరిగేలా చేస్తుంది.
సిలికాన్, సల్ఫర్ సమృద్ధిగా ఉండే దోసకాయ రసం జుట్టు మూలాలను బలపరుస్తుంది. తెగిపోకుండా చేస్తుంది. అలాగే జుట్టును షైనీగా చేస్తుంది. నెత్తిని హైడ్రేట్ గా ఉంచుతుంది.
ఎంజైమ్, పోషకాలతో నిండిన కలబంద రసం జుట్టు పెరిగేందుకు బాగా సహాయపడుతుంది. ఇది స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. బలమైన, ఆరోగ్యకరమైన తంతువుల కోసం జుట్టు కుదుళ్లను పోషిస్తుంది.
బీటా-కెరోటిన్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న క్యారెట్ జ్యూస్ జుట్టును బాగా పెంచుతుంది. ఇది జుట్టు పల్చబడడాన్ని నిరోధిస్తుంది. అలాగే జుట్టును షైనీగా చేస్తుంది.