Lifestyle

ఈ ఇంటి చిట్కాలతో తెల్ల జుట్టు నల్లగా మారుతుంది తెలుసా?

హెన్నా

హెన్నా అనేది ఒక సహజమైన హెయిర్ డై. తెల్లజుట్టును నల్లగా మార్చడానికి హెన్నా పొడిలో నీళ్లు పోసి పేస్ట్‌ను తయారు చేయండి. దీన్ని జుట్టంతా పెట్టి కొన్ని గంటల తర్వాత కడిగేయండి. 
 

ఉల్లిపాయ రసం

ఇది జుట్టు రంగును నల్లగా మార్చానికి సహాయపడే ఎంజైమ్‌లను కలిగుంటుందని నమ్ముతారు.  తాజా ఉల్లిపాయ రసాన్ని తీసుకుని తలకు పట్టించాలి. సుమారు 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. 
 

ఉసిరి

జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చడానికి ఇది ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఉసిరికాయ రసాన్ని మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. 
 

కొబ్బరి నూనె, కరివేపాకు

కొబ్బరి నూనెలో తాజా కరివేపాకులను వేసి మరగబెట్టండి.  ఈ నూనెను క్రమం తప్పకుండా తలపై మసాజ్ చేయండి. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది.వెంట్రుకలను నల్లగా చేస్తుంది. 
 

సమతుల్య ఆహారం, జీవనశైలి

ఆకు కూరలు, గింజలతో పాటుగా ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినండి. అలాగే హైడ్రేటెడ్ గా ఉండండి. ఒత్తిడిని తగ్గించుకోండి. 

బ్లాక్ టీ

ఒక కప్పు బ్లాక్ టీని కాయండి. తర్వాత చల్లబరచండి. శుభ్రమైన, తడిగా ఉన్న జుట్టుకు దీన్ని పెట్టండి. అలాగే కడిగే ముందు కనీసం ఒక గంట పాటు ఉంచండి.

 

రోజ్మేరీ, సేజ్

రోజ్మేరీ, సేజ్ ఆకులను నీటిలో ఉడకబెట్టి హెర్బల్ రిన్స్ ను తయారుచేయండి. మిశ్రమాన్ని చల్లబరిచ, వడకట్టండి. షాంపూ చేసిన తర్వాత, హెర్బల్ రిన్స్‌ను చివరి హెయిర్ రిన్స్‌గా ఉపయోగించండి.
 

ఈ జ్యూస్ లను తాగితే మీ జుట్టు పెరగడం పక్కా..

డెంగ్యూ, మలేరియా తొందరగా తగ్గాలంటే..?

ఇలా చేస్తే జుట్టు రాలనే రాలదు

చామంతి టీ నుంచి వెచ్చని పాల వరకు.. ఇవి బాగా నిద్రపోవడానికి సహాయపడతాయి