Lifestyle

దైనందిన జీవితంలో..

మతిమరుపు చిన్న సమస్యగా కనిపించినా.. ఇది ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. అందుకే మతిమరుపు సమస్య వచ్చినట్టు అనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఇవి అల్జీమర్స్ కు సంకేతాలు కావొచ్చు.

Image credits: Getty

సమస్యలను పరిష్కరించకపోవడం

పనులను ఏ సమయంలో చేయాలి? ఎలా చేయాలి? అన్న ప్రణాళిక లేకపోవడం, అలాగే సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని కోల్పోవడం అల్జీమర్స్ కు సంకేతం కావొచ్చు.
 

Image credits: Getty

పనులు చేయకపోవడం

మనకు అలవాటున్న పనులను చేయడం చాలా సులువు. అయితే మీరు చేసిన పనులు కూడా చేయలేకపోతే ఇది అల్జీమర్స్ కు సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు.
 

Image credits: Getty

టైం, స్థలం మర్చిపోవడం

మతిమరుపు మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతుంది. అయితే మీకు అల్జీమర్స్ ఉంటే సమయం, ప్లేస్ గురించి మీరు గందరగోళానికి గురవుతారు. మీరెక్కడున్నారో మర్చిపోతే అల్జీమర్స్ కు సంకేతం కావొచ్చు.
 

Image credits: Getty

మాట్లాడటం, రాయటంలో ఇబ్బంది

అల్జీమర్స్ సమస్య ఉన్నవారికి మాట్లాడటంలో, రాయటంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఇవి అల్జీమర్స్ కు సంకేతాలు. 
 

Image credits: Getty

సమాజానికి దూరంగా..

ఈ సమాజానికి, సంబంధాలకు దూరంగా ఉండటం కూడా అల్జీమర్స్ కు సంకేతమేనంటున్నారు నిపుణులు. ఈ సమస్య వల్ల రిలేషన్స్ ను కూడా మర్చిపోతుంటారు. 
 

Image credits: Getty

వ్యక్తిత్వంలో మార్పు

అల్జీమర్స్ వల్ల ఒక వ్యక్తి తన వ్యక్తిత్వంలో ఎంతో మార్పును చూస్తాడు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు తరచుగా మూడ్ స్వింగ్స్ వంటి సమస్యల బారిన పడుతుంటారు. 

Image credits: Getty

పీరియడ్స్ రెగ్యులర్ గా కాకపోవడానికి కారణమిదే..!

వీటితో మీ జుట్టు ఎంత పొడుగ్గా పెరుగుతుందో..!

మంచివని ఉల్లిపాయలను అతిగా తిన్నారో మీ పని అంతే..

ఈ కూరగాయలను తిన్నా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది తెలుసా?