Lifestyle
చాలా మంది ఆడవారికి పీరియడ్స్ సరిగ్గా రాకపోవచ్చు. రెండు, మూడు రోజులు లేట్ గా పీరియడ్స్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. కానీ చాలా రోజులు ఇలా అయితే మాత్రం హాస్పటల్ కు వెళ్లాల్సిందే.
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆడవారి ఆరోగ్యంపై కూడా ఎంతో ప్రభావాన్నిచూపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు కారణాలేంటంటే?
పీరియడ్స్ ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి స్త్రీ హార్మోన్ల ద్వారా నియంత్రించబడుతుంది. ఈ హార్మోన్లు అసమతుల్యంగా మారితే పీరియడ్స్ రెగ్యులర్ గా కావు.
ప్రస్తుత కాలంలో చాలా మంది గర్భనిరోధక మందులను వాడుతున్నారు. కానీ ఈ గర్భనిరోధకాల వల్ల పీరియడ్స్ సక్రమంగా రావు.
ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్నే కాదు.. శారీరక ఆరోగ్యాన్నికూడా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే ఆడవారికి పీరియడ్స్ రెగ్యులర్ గా రావు.
కొన్ని రకాల ముందులను వాడటం వల్ల కూడా పీరియడ్స్ రెగ్యులర్ గా రావు. ఒకవేళ మీకు ఇలాంటి సమస్యే ఎదురైతే హాస్పటల్ కు వెళ్లి చెకప్ లు చేయించుకోండి.