Lifestyle
ప్రస్తుత కాలంలో చాలా మంది బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారు. ఈ బెల్లీ ఫ్యాట్ ను ఉదర కొవ్వు లేదా విసెరల్ శరీర కొవ్వు అని అంటారు.
బెల్లీ ఫ్యాడ్ వల్ల డయాబెటిస్, గుండె జబ్బులతో పాటుగా ఇతర అనారోగ్య సమస్యల ముప్ప కూడా బాగా పెరుగుతుంది. అందుకే దీన్ని తగ్గించుకోవాలి.
బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి ఎన్నో ఆహారాలు సహాయపడతాయి. వీటిలో కొన్నిరకాల కూరగాయలు కూడా ఉన్నాయి. వీటిని తింటే బెల్లీ ఫ్యాట్ బాగా తగ్గుతుంది.
బచ్చలికూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే దీన్ని తినడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతో పాటుగా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది.
పుట్టగొడుగులు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తింటే బరువు తగ్గడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి.
క్యారెట్లలో కరగని, కరగని ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వీటిని తింటే బెల్లీ ఫ్యాట్ సులువుగా తగ్గుతుంది.
బీన్స్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల మీ బరువు తగ్గుతుంది. ఊబకాయం రిస్క్ కూడా తగ్గుతుంది.