Lifestyle

ఉల్లిపాయలను ఎక్కువగా తినడం వల్ల వచ్చే సమస్యలు..

Image credits: Getty

జీర్ణ అసౌకర్యం

పచ్చి ఉల్లిపాయలను ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. ఫ్రక్టాన్స్ అనే కార్బోహైడ్రేట్‌లకు సున్నితంగా ఉండే వ్యక్తులకు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు సమస్యలు వస్తాయి

Image credits: Getty

చెడు శ్వాస

పచ్చి ఉల్లిపాయలను ఎక్కువగా తింటే కూడా నోటి నుంచి చెడు వాసన వస్తుంది. ఉల్లిపాయల ఘాటైన వాసన, దీనిలోని సల్ఫర్ సమ్మేళనాలు నోటి దుర్వాసనకు కారణమవుతాయి.
 

Image credits: Getty

గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి లేదా గుండెల్లో మంట వచ్చే అవకాశం కూడా ఉంది. ముందే ఈ సమస్య ఉన్నవారు వీటిని ఎక్కువగా తింటే సమస్య పెద్దది అవుతుంది. 
 

Image credits: Getty

అలర్జీలు

ఉల్లిపాయలను మరీ ఎక్కువగా తింటే అలెర్జీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది చర్మంపై దురద, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా అనాఫిలాక్సిస్ వంటి సమస్యలను కలిగిస్తుంది. 
 

Image credits: Getty

చర్మ సమస్యలు

పచ్చి ఉల్లిపాయలను తింటే కొన్ని కొన్నిసార్లు కాంటాక్ట్ డెర్మటైటిస్ వంటి చర్మ సమస్యలు కూడా వస్తాయి. దీనివల్ల చర్మం ఎర్రగా మారడం, దురద, బొబ్బలు వంటి సమస్యలు వస్తాయి.

Image credits: Getty
Find Next One