Lifestyle
సిట్రస్ పండ్లలో విటమిన్ సితో పాటుగా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ సీజన్ లో నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లను తినడం వల్ల మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
వెల్లుల్లిలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. దీన్ని మన రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
పసుపునకు 'కర్కుమిన్' అనే రసాయనమే ఆ రంగును ఇస్తుంది. ఈ కర్కుమిన్ ఔషదంతో సమానం. ఇది మన ఊపిరితిత్తులపై ప్రభావం చూపే వైరస్ పై సమర్థవంతంగా పనిచేస్తుంది.
సాల్మన్ వంటి కొవ్వు చేపలల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
బ్లాక్ బెర్రీలు, బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు వంటి రకరకాల బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి.
బచ్చలికూర విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. బచ్చలికూర వంటి ఆకు కూరలను తిన్నా ఊపిరితిత్తుల ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.
వాల్ నట్స్, బాదం వంటి గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.