Lifestyle

కొలెస్ట్రాల్

ఓట్స్ లో ఫైబర్ తో పాటుగా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 

Image credits: Getty

అధిక రక్తపోటు

ఓట్స్ లో మెగ్నీషియం మంచి మొత్తంలో ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే హైబీపీతో బాధపడేవారు వీటిని ఎంచక్కా తినొచ్చు. 
 

Image credits: Getty

డయాబెటీస్

మధుమేహులకు కూడా ఓట్స్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఓట్స్ లో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. 
 

Image credits: Getty

మలబద్ధకం

ఓట్స్ ను తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వీటిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. 
 

Image credits: Getty

క్యాన్సర్ ముప్పు

పలు అధ్యయనాల ప్రకారం.. ఓట్స్ ను తింటే కొన్నిరకాల క్యాన్యర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
 

Image credits: Getty

బరువు తగ్గడానికి

ఓట్స్ లో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ ఆకలిని తగ్గిస్తుంది. అలాగే కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు చాలా త్వరగా బరువు తగ్గుతారు. 
 

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

ఓట్స్ చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. దీనిలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

 

Image credits: Getty

వీటిని తింటే మేకప్ వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు తెలుసా?

పెసర్లతో ఇన్ని లాభాలా?

ఒంటి నుంచి దుర్వాసన వస్తోందా? అయితే ఇలా చేయండి

పండ్లను రెగ్యులర్ గా తింటే ఏమౌతుందో తెలుసా?