Lifestyle

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లు విటమిన్ సి కి మంచి వనరు. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుందన్న ముచ్చట అందరికీ తెలుసు. అయితే ఈ పండ్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో మీరు అందంగా కనిపిస్తారు. 
 

Image credits: Getty

బెర్రీలు

బెర్రీలు మన ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడతాయి. అవును బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలు వంటి బెర్రీలు కూడా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి.
 

Image credits: Getty

ఆకుకూరలు

మునగాకు, బచ్చలికూర వంటి తీరొక్క ఆకు కూరలు కరూడా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి. దీంతో మీ చర్మం అందంగా కనిపిస్తుంది. మీ ముఖంలో గ్లో పెరుగుతుంది.
 

Image credits: Getty

అవొకాడో

అవొకాడోలు కూడా చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచేందుకు సహాయపడుతుంది. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. 
 

Image credits: Getty

గింజలు, విత్తనాలు

జింక్ పుష్కలంగా ఉండే వాల్ నట్స్, బాదం, అవిసె గింజలు వంటి వివిధ రకాల విత్తనాలు, గింజలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతాయి.
 

Image credits: Getty

క్యాప్సికమ్

క్యాప్సికమ్ లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. విటమిన్-సి సమృద్ధిగా ఉండే క్యాప్సికమ్ ను తినడం వల్ల కూడా కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. 
 

Image credits: Getty

టమాటాలు

టమాటాలు లేని కూరే ఉండదు. అయితే ఈ టమాటాలు కూడా మీరు అందంగా కనిపించడానికి సహాయపడతాయి. వీటిలో 'లైసోపీన్' చర్మాన్ని అందంగా మార్చుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.
 

Image credits: Getty

గుడ్డు

గుడ్లు మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను అందిస్తుంది. గుడ్డులోని తెల్లసొనలోని అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి.
 

Image credits: Getty

పెసర్లతో ఇన్ని లాభాలా?

ఒంటి నుంచి దుర్వాసన వస్తోందా? అయితే ఇలా చేయండి

పండ్లను రెగ్యులర్ గా తింటే ఏమౌతుందో తెలుసా?

బొప్పాయి ఆకులతో ఇన్ని లాభాలా?