Lifestyle
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంతో పాటుగా మన మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడతాయి.
బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలు విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే అవొకాడోలను తినడం వల్ల కూడా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. షార్ప్ గా పనిచేస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు వంటి రకరకాల బెర్రీలు కూడా మెదడు ఆరోగ్యానికి మంచివి.
గింజలు ఫైబర్, ఇతర విటమిన్లకు మంచి వనరు. రోజూ గుప్పెడు గింజలను తింటే మెదడు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మన శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉండే సాల్మన్ వంటి చేపలను మీ ఆహారంలో చేర్చడం వల్ల కూడా మెదడు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో మెదడు ఆరోగ్యంగా ఉండటం ఒకటి.