Lifestyle

చక్కెర దుష్ప్రభావాలు

చక్కెరతో చేసిన ఆహారాలు నోటికి టేస్టీగా అనిపించినా ఇవి మన ఆరోగ్యానికి మాత్రం అస్సలు మంచివి కావు. ఎందుకంటే ఇవి మిమ్మల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తాయి. 
 

Image credits: Getty

లక్షణాలు

కొంతమంది ఎంత తింటున్నామో తెలియకుండా చక్కెరను లాగిస్తుంటారు. కానీ చక్కెరను ఎక్కువగా తీసుకుంటే మీకు ఎన్నో సమస్యలు వస్తాయి. అవేంటంటే? 
 

Image credits: Getty

బరువు పెరుగుతారు

అవును చక్కెర కూడా మీ బరువును పెంచుతుంది. ఎందుకంటే చక్కెరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మీరు చక్కెరను ఎక్కువగా తింటే మీ బరువు అమాంతం పెరుగుతుంది. 
 

Image credits: Getty

మొటిమలు

చక్కెర  మొటిమలను కూడా కలిగిస్తుంది. అవును మీరు చక్కెరను ఎక్కువగా తీసుకుంటే మొటిమలు, ఇతర చర్మ సమస్యలు అవుతాయి.  
 

Image credits: Getty

స్వీట్ల పట్ల ఆసక్తి

చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు స్వీట్లపై ఆసక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆకలి పెరిగేందుకు దారితీస్తుంది. 
 

Image credits: Getty

డిప్రెషన్

డిప్రెషన్ మనం అనుకున్నంత చిన్న సమస్యేం కాదు. కానీ చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల కూడా డిప్రెషన్ ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
 

Image credits: Getty

రక్తపోటు పెరుగుతుంది

ఉప్పే కాదు చక్కెర కూడా మీ రక్తపోటును పెంచుతుంది. ఇది ఊబకాయం, డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

Image credits: Getty

అలసట

చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు అలసటకు గురవుతారని నిపుణులు చెబుతున్నారు. అందుకే చక్కెరను ఎక్కువగా తీసుకోకూడదు. 
 

Image credits: Getty

మోకాలి నొప్పి

చక్కెర మోకాళ్ల నొప్పులను కూడా కలిగిస్తుంది. అందుకే సయాటికా ఉన్నవారు చక్కెరను మొత్తమే తీసుకోకూడదు. 
 

Image credits: Getty

నిద్ర లేమి

చక్కెర పదార్థాలు నిద్రలేమికి కూడా కారణమవుతాయి. ఇది అధిక ఆకలికి, నిద్రలేమికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. 
 

Image credits: Getty

పిస్తాపప్పులను తింటే ఇంత మంచిదా..!

పరిగడుపున గోరువెచ్చని లెమన్ వాటర్ ను తాగితే ఇన్ని లాభాలా?

బ్లూ టీతో ఇన్ని లాభాలా..!

దానిమ్మ పండుగను రోజూ తింటే ఇన్ని లాభాలా..!