Fridge Safety: మీ ఫ్రిడ్జ్ ఎప్పటికీ పాడవ్వకుండా ఉండాలంటే ఇదొక్కటి చాలు
life Apr 07 2026
Author: Nandini Arava Image Credits:our own
Telugu
చిన్న నిర్లక్ష్యంతోనే ప్రమాదం
వేసవి తాపానికి ఫ్రిజ్‌ల వాడకం బాగా పెరుగుతుంది. ఈ సమయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. అందుకే మీ ఫ్రిజ్ సేఫ్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.
Image credits: AI Generated
Telugu
గాలి ఆడేలా ఖాళీ ఉంచండి
ఫ్రిజ్‌ను గోడకు ఆనించి పెట్టొద్దు. దాని వెనుక కనీసం 5-6 అంగుళాల ఖాళీ ఉండేలా చూసుకోండి. దీనివల్ల కంప్రెసర్ ఓవర్‌హీట్ అవ్వకుండా ఉంటుంది.
Image credits: social media
Telugu
స్టెబిలైజర్ వాడండి
వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల కంప్రెసర్ కాలిపోకుండా ఉండాలంటే స్టెబిలైజర్ తప్పనిసరి. ఇది ఫ్రిజ్‌ను సురక్షితంగా ఉంచుతుంది.
Image credits: Getty
Telugu
వైరింగ్ చెక్ చేసుకోండి
ఎలుకలు వైర్ కొరికాయా? లేదా ప్లగ్ ఏమైనా కాలిపోయిందా? అని గమనించండి. ఎప్పుడూ పవర్ ప్లగ్స్ మాత్రమే వాడాలి. లూజ్ కనెక్షన్లు ప్రమాదకరం.
Image credits: Freepik
Telugu
టెంపరేచర్ సెట్టింగ్
వేసవిలో టెంపరేచర్ మరీ తక్కువలో పెట్టొద్దు. దీనివల్ల పాత ఫ్రిజ్‌ల కంప్రెసర్‌పై ఒత్తిడి పెరిగి, పేలుడుకు దారితీయొచ్చు.
Image credits: Freepik
Telugu
నేరుగా ఎండ తగలొద్దు
ఫ్రిజ్‌పై నేరుగా సూర్యరశ్మి పడే చోట అస్సలు పెట్టకండి. అలా పెడితే కంప్రెసర్‌పై ఎక్కువ భారం పడుతుంది.
Image credits: Asianet News
Telugu
సర్వీసింగ్
సంవత్సరానికి కనీసం రెండుసార్లు నిపుణులతో ఫ్రిజ్ సర్వీసింగ్ చేయించాలి. దీనివల్ల లోపల ఏమైనా సమస్యలుంటే ముందుగానే తెలుస్తాయి.