వేసవిలో మీ ఇంటిని అలంకరించడానికి ఈ కర్టెన్లు బెస్ట్
Telugu
రంగురంగుల పూల ప్రింట్ కర్టెన్లు
వేసవిలో ఇంటిని చల్లగా ఉంచుకోవాలనుకుంటే అందమైన, రంగురంగుల కర్టెన్లతో ఇంటిని అలంకరించండి. ఇవి మీ గదికి అందాన్ని పెంచుతాయి.
Telugu
ప్లెయిన్ సాటిన్ కర్టెన్లు
ప్లెయిన్ సాటిన్ కర్టెన్లు ఇంటికి క్లాసిక్ లుక్ ఇస్తాయి. లేదా లేత ఆకుపచ్చ రంగు కర్టెన్లు కూడా బాగుంటాయి. ఇంకా అందంగా ఉండాలంటే మధ్యలో తెల్లని నేక్ కర్టెన్ను ఉపయోగించండి.
Telugu
పూల ప్రింట్ కర్టెన్లు
మీ గదిలో లేత గులాబీ రంగు కర్టెన్ను ఉపయోగించాలనుకుంటే ఇలాంటి పూల ప్రింట్ కర్టెన్లను ఎంచుకోండి. ఇది మీ గదికి ప్రత్యేకమైన అందాన్నిస్తుంది.
Telugu
బ్రౌన్ స్టైలిష్ కర్టెన్లు
మీరు మీ ఇంటిని స్టైలిష్ గా మార్చాలనుకుంటే ఇలాంటి స్టైలిష్ కర్టెన్లను ఉపయోగించండి. మీ ఇంటికి వచ్చిన అతిథులు ఆశ్చర్యపోతారు.
Telugu
లీఫ్ ప్రింట్ కర్టెన్లు
ఇంటికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడానికి మీరు లేత నీలం, తెలుపు కలయికలో ఉన్న ఇలాంటి కర్టెన్లను ఉపయోగించండి. ఇది మీ ఇంటికి ప్రత్యేకమైన రూపాన్నిస్తుంది.
Telugu
చీరతో ఇంటికి కొత్త రూపం
మీ పాత చీరతో లేత రంగు కర్టెన్లను తయారు చేసి మీ ఇంటిని అలంకరించండి. ఈ రెండు రంగుల కర్టెన్ మీ ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది.