ఖాళీ కడుపుతో చెరకు రసం తాగడం వల్ల కామెర్లు తగ్గుతాయి. ఇది శరీరానికి శక్తినిచ్చి, కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.
ఉదయం 7-8 తులసి ఆకులు నమిలి తినవచ్చు లేదా కషాయం కాచి తాగితే కామెర్లు తగ్గుతాయి.
బాగా పండిన బొప్పాయి తినడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. బొప్పాయిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.
నిమ్మరసం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది, కాలేయాన్ని డిటాక్సిఫై చేస్తుంది. కామెర్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
కామెర్లకు తెల్ల ముల్లంగి రసం చాలా మంచిది. కాబట్టి ప్రతిరోజూ ఒక గ్లాసు తాగండి. ఇది కాలేయం వాపును తగ్గిస్తుంది, జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది.
కామెర్లు శరీరాన్ని బలహీనపరుస్తాయి. కాబట్టి విశ్రాంతి చాలా అవసరం. ఎండలో వెళితే సమస్య పెరుగుతుంది కాబట్టి ఇంట్లోనే ఉండండి.
కామెర్ల సమయంలో నూనె పదార్థాలు తినడం మానుకోండి. బదులుగా ఉడికించిన కూరగాయలు, పప్పు వంటివి తీసుకోండి.
Curry Leaves: కరివేపాకుతో కిచెన్ క్లీనింగ్.. ఎలాగో తెలుసా?
కొబ్బరి నూనె ఇలా తీసుకుంటే, బరువు తగ్గడం ఈజీ
వేసవిలో ఇవి తింటే.. కడుపు చల్లగా.. పొట్ట నిండుగా..
Hair Growth: బలమైన జుట్టు కోసం తినాల్సిన బయోటిన్ సూపర్ ఫుడ్స్ ఇవే..