Lifestyle
దోమల కాటుకు గురైతే లేనిపోని రోగాలు వస్తాయి. అందుకే ఈ దోమ కాటు నుంచి పిల్లలను రక్షించడం చాలా ముఖ్యం.
దోమ కాటు వల్ల మలేరియా, డెంగ్యూ జ్వరం, చికున్ గున్యా వంటి ఎన్నో రోగాలు వస్తాయి. ఈ రోగాలు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతాయి.
పిల్లలకు దోమలు కుట్టకూడదంటే వారి శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే దుస్తులను వేయాలి.
పిల్లలకు కాటన్ దుస్తులు మంచివి. ఎందుకంటే గాలి, వెలుతురు శరీరానికి తగిలేలా ఈ బట్టలు ఉంటాయి. అందుకే వారికి కాటన్ బట్టలనే వేయాలి.
దోమల నుంచి పిల్లల్ని రక్షించడానికి మరొక మార్గం.. దోమతెరల వాడకం. అవును మీ పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత దోమలు కుట్టకుండా దోమతెరలను కప్పండి.
మీకు తెలుసా? దోమలు ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళల్లోనే వస్తుంటాయి. కాబట్టి ఈ సమయంలో పిల్లలను బయటకు వెళ్లనివ్వకండి.
ఇంటి బయట నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మొక్కలు, ఇతర ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిలో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది.