Lifestyle
ఆడవారు కాల్షియం ఎక్కవుగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఇది వారి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా మహిళలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇది రక్తహీనతను నివారించడానికి, ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.
ఆడవారి పునరుత్పత్తి ఆరోగ్యానికి ఫోలేట్ ఒక ముఖ్యమైన పదార్ధం. దీన్ని కూడా ఆడవారు రెగ్యులర్ గా తినాలి.
గుండె, మెదడు కోసం ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను ఆడవారు ఎక్కువగా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సూర్యరశ్మి విటమిన్ డి కి ప్రధాన వనరు. అయితే విటమిన్ డి ని కొన్ని ఆహారాల నుంచి కూడా పొందొచ్చు. ఇది తగ్గితే ఎముకలు, కండరాలు, వెంట్రుకలు, చర్మం అన్నీ దెబ్బతింటాయి.
కండరాలు, నరాల ఆరోగ్యానికి మెగ్నీషియం చాలా అవసరం. అందుకే మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఆహారాలను ఆడవాళ్లు రోజూ తినాలి.
రోగనిరోధక శక్తి, జుట్టు, చర్మ ఆరోగ్యానికి విటమిన్ సి చాలా అవసరం. సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
కండరాల నిర్మాణం, ఆరోగ్యం, హార్మోన్ల ఉత్పత్తికి ప్రోటీన్ చాలా చాలా అవసరం. కాబట్టి ప్రోటీన్ ఫుడ్స్ ను కూడా రెగ్యులర్ గా తినాలి.