Lifestyle
మన చర్మ సంరక్షణలో ఆహారాలు పోషించే పాత్ర ఎనలేనిది. ముఖ్యంగా పండ్లు మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి.
విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఆర్ద్రీకరణ ఎక్కువగా ఉండే పండ్లు మన చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.
బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, కోరిందకాయలు, బ్లాక్బెర్రీలను తినడం వల్ల ఎన్నో చర్మ సమస్యలు దూరమవుతాయి.
నారింజ, ద్రాక్ష పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ మెండుగా ఉంటుంది. బొప్పాయిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.
అవొకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల కూడా చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది.
కివి పండ్లలో విటమిన్ ఇ, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. కివి పండును తింటే చర్మం గ్లో అవుతుంది. ఆరోగ్యంగా కూడా ఉంటుంది.
మీకు డయాబెటీస్ ఉన్నట్టు అనుమానం ఉందా? ఇలా కన్ఫామ్ చేసుకోండి
గుండె జబ్బులు రావొద్దంటే వీటిని ఖచ్చితంగా తినండి
మీ పళ్లు తెల్లగా కనిపించాలంటే ఇలా చేయండి
పరిగడుపున నీళ్లు తాగొచ్చా? ఒకవేళ తాగితే ఏమౌతుంది?