Lifestyle

ఆకలి, దాహం

డయాబెటీస్ ను ఎన్నో లక్షణాలతో గుర్తుపట్టొచ్చు. మీకు దాహం, ఆకలి ఎక్కువగా అయితే అనుమానించాల్సిందే.  ఎందుకంటే ఇవి డయాబెటిస్ ప్రధాన లక్షణాలు.
 

Image credits: Getty

గాయాలు నెమ్మదిగా నయం

ఎలాంటి గాయాలైనా కొన్ని రోజుల్లోనే తగ్గిపోతాయి. అయితే డయాబెటీస్ ఉంటే మాత్రం గాయాలు అంత తొందరగా నయం కావు. 

Image credits: Getty

తరచుగా మూత్రం

డయాబెటీస్ ఉంటే కూడా తరచుగా మూత్రం వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. 
 

Image credits: Getty

అస్పష్టమైన చూపు

డయాబెటీస్ ఉంటే కంటిచూపు పై కూడా ప్రభావం పడుతుంది. డయాబెటీస్ ఉంటే చూపు మసకబారడం, నరాలు దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి. 
 

Image credits: Getty

అలుపు

అధిక అలసట, బలహీనత, అకస్మత్తుగా బరువు తగ్గినట్టైతే కూడా అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇవి కూడా డయాబెటీస్ కు సంకేతాలు. 
 

Image credits: Getty

చేతులు, కాళ్లలో తిమ్మిరి

అవయవాల తిమ్మిరి, పాదాలలో నొప్పి,  కాళ్లలో శాశ్వత అసౌకర్యం కూడా డయాబెటిస్ లక్షణాలే కావొచ్చంటున్నారు నిపుణులు. 
 

 

Image credits: Getty

చర్మంపై మచ్చలు

డయాబెటీస్ చర్మంపై ప్రభావం చూపుతుంది. పొడి చర్మం, చర్మంపై ముదురు, మందపాటి మచ్చలు కూడా డయాబెటీస్ లక్షణాలే కావొచ్చు. 
 

Image credits: Getty

సలహా

మీరు పై లక్షణాలను గమనించినట్టైతే మీకు మీరే డయాబెటీస్ ఉన్నట్టు నిర్ధారించుకోండి. వైద్యులను సంప్రదించిన తర్వాతే ఈ వ్యాధి ఉన్నట్టు కన్ఫామ్ చేసుకోండి. 

 

Image credits: Getty
Find Next One