Lifestyle
ఆరోగ్యంగా ఉన్నవారికి కొన్ని లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. వీటిలో స్వీయ సంరక్షణ, ఆశావాదం, సానుకూల దృక్పథం ఉన్నాయి.
పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు ఏ డైట్ ను ఖచ్చితంగా పాటించరు. అలాగే ఎక్కువగా తినరు. ఆహారాన్ని లిమిట్ లోనే తింటారు.
ఆరోగ్యంగా ఉన్నవారు శారీరక శ్రమ ఖచ్చితంగా చేస్తారు. అది ఏ రకమైన శారీరక శ్రమ అయినా కావొచ్చు. అంటే వ్యాయామం, గేమ్స్, ఆటల్లో వంటి వాటిలో ఏదైనా కావొచ్చు.
ప్రతిరోజూ సరైన నిద్రపోవడం కూడా ఆరోగ్యకరమైన వ్యక్తుల లక్షణం. వీళ్లు ఖచ్చితంగా నిద్ర వేళలను పాటిస్తారు.
ఆరోగ్యంగా ఉన్నవాళ్లు స్క్రీన్ టైమ్ ను కంట్రోల్ చేస్తూ ముందుకు సాగుతారు. ఎందుకంటే వారికి ఎక్కువ ఫోన్ వాడకం వల్ల వచ్చే సమస్యల గురించి తెలుసు కాబట్టి.
ఆరోగ్యంగా ఉన్నవారు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఇతరులతో కలవడానికి అస్సలు వెనుకాడరు. అదే వారి ఆరోగ్య రహస్యం కూడా.
ఆరోగ్యకరమైన వ్యక్తులకున్న మరో లక్షణం ఏమిటంటే వారు ఇంట్లో వంట చేయడానికి కూడా ఆసక్తి చూపుతారు. మంచి ఆహారమే మంచి ఆరోగ్యానికి పునాది కాబట్టి.
ఇతరులతో పోటీపడటం ఆరోగ్యవంతుల స్వభావం కానేకాదు. వీళ్లు తమ ఎదుగుదలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటారు. అలాగే ముందుకు సాగుతారు.