Lifestyle
జీర్ణ సమస్యలతో బాధపడేవారికి కలబంద మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. కలబంద మన కడుపులోని మంచి రకాల బ్యాక్టీరియాను బలోపేతం చేస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
మనం తినే ఆహారం నుంచి అవసరమైన పోషకాలను గ్రహించలేకపోతే దాన్ని తిని లాభం లేదు. అయితే కలబంద పోషకాలను గ్రహించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
కలబంద వ్యాధులు, ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మన ఇమ్యూనిటీని పెంచుతాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా కలబంద ఎంతో సహాయపడుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి.
కలబంద నోటి లోపల బ్యాక్టీరియాను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అలాగే మన నోటిని శుభ్రంగా ఉంచడానికి కూడా తోడ్పడుతుంది.
కలబంద కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. దీంతో మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
బరువు తగ్గాలనుకునేవారికి కలబంద సహాయపడుతుంది. ఇందుకోసం మీరు దీని రసాన్ని బరువు తగ్గించే డైట్ లో చేర్చుకోవచ్చు.