బరువు తగ్గడం అంత సులువైన పని కాదు. కానీ కొన్ని చిట్కాలను రెగ్యులర్ గా ఫాలో అయితే మాత్రం సులువుగా బరువు తగ్గొచ్చని నిపుణులు అంటున్నారు.
life Jan 10 2024
Author: Shivaleela Rajamoni Image Credits:google
Telugu
బరువును తగ్గించే పండ్లు
పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. వీటిని తింటే బరువు తగ్గుతారని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అవేంటంటే?
Image credits: google
Telugu
నారింజ
విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ పండ్లు కూడా మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి. అలాగే ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి.
Image credits: google
Telugu
స్ట్రాబెర్రీలు
కోరిందకాయలు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు వంటి బెర్రీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తిన్నా బరువు తగ్గుతారు.
Image credits: google
Telugu
కివి
కివిల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే వీటిలో విటమిన్ సి, విటమిన్ కె, డైటరీ ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. ఈ పండు బరువును తగ్గించడానికి సహాయపడుతుంది.
Image credits: google
Telugu
ఆపిల్
యాపిల్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆపిల్స్ లో బరువును నియంత్రించడానికి సహాయపడే సమ్మేళనాలు మెండుగా ఉంటాయి.
Image credits: google
Telugu
జామ
బరువు తగ్గడానికి సహాయపడే మరో పండు జామకాయ. అవును జామకాయను తిన్నా కూడా మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. ఒక జామకాయలో 37 కేలరీలు మాత్రమే ఉంటాయి.