Lifestyle
రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల చాలా అలసటగా అనిపిస్తుంది. ఇలా రోజంతా ఉంటుంది. పని లేదా ఇతర పనులు చేయడం కూడా కష్టంగా ఉంటుంది.
తరచూ నిద్ర సమస్యలతో బాధపడేవారు దేనిపై కూడా ఏకాగ్రతను పెట్టలేరు. ఇది ప్రమాదాలకు, పొరపాట్లకు దారితీస్తుంది.
నిద్ర సమస్యలు ఉన్నవారికి అకస్మాత్తుగా కోపం, విచారం వంటి మూడ్ స్వింగ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
అధిక ఆకలి నిద్ర సమస్యలు ఉన్నవారిలో కనిపించే మరొక లక్షణం. వీళ్లకు మరీ ఎక్కువగా ఆకలి అవుతుంది. అలాగే తిన్నారంటే బరువు విపరీతంగా పెరిగిపోతారు.
మనకు క్రమం తప్పకుండా నిద్ర సమస్యలు ఉంటే మీ రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల మీరు ఎన్నో వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడాల్సి వస్తుంది.
కంటి చూపు మసకబారడం కూడా నిద్ర సమస్యల లక్షణమేనంటున్నారు నిపుణులు. కంటినిండా నిద్రలేకపోవడం వల్ల కళ్లు పొడిబారడం, కంటి నొప్పి సమస్యలు వస్తాయి.
తరచూ నిద్ర సమస్యలతో బాధపడేవారు బాగా బరువు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్లకు ఇతరులకంటే ఎక్కువగా ఆకలి అవుతుంది.
ఒత్తిడి నిద్రలేమికి దారితీస్తుంది. అదే విధంగా నిద్రలేమితో ఒత్తిడి బారిన కూడా పడొచ్చు. ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తుంది.