Lifestyle

కుక్క

మానవులకు అత్యంత కృతజ్ఞత కలిగిన జంతువు కుక్క. ఇవి మనుషుల జీవితాల్లో ఒక భాగంగా మారిపోయాయి. అంతేకాక నమ్మకమైనవాటిగా గుర్తింపు పొందాయి కూడా. 

Image credits: Getty

గుండె  ఆరోగ్యం

పెంపుడు కుక్కలకు దగ్గరగా ఉండటం వల్ల బీపీ తగ్గుతుందని.. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
 

Image credits: Getty

ఒత్తిడి

పెంపుడు కుక్కతో సమయాన్ని గడపడం ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు ఇది మన ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. 
 

Image credits: Getty

నొప్పి తగ్గుదల

పెంపుడు కుక్కలతో సమయం గడపడం వల్ల కూడా నొప్పి తగ్గుతుందని పలు అద్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
 

Image credits: Getty

మానసిక ఆరోగ్యం

పెంపుడు కుక్కలు ఉన్నవారి మానసిక ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి మానసిక ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. 
 

Image credits: Getty

శారీరక శ్రమ

పెంపుడు కుక్కలు ఉన్నవారు ఇందులో భాగంగా సహజంగానే కొద్దిగా శారీరక శ్రమ చేస్తారు తెలుసా? అంటే కుక్కను వాకింగ్ కు తీసుకెళ్లడం లాంటివి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

Image credits: Getty

కొలెస్ట్రాల్

పెంపుడు కుక్కలతో సన్నిహితంగా మెలిగేవారిలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది గుండె ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

Image credits: Getty
Find Next One