మీరు మనీ ప్లాంట్ ను పెంచే మొక్క కుండీ అడుగు భాగంలో ఖచ్చితంగా ఒక రంధ్రం పెట్టాలి. దీంతో ఎక్కువైన వాటర్ దాంట్లోంచి బయటకు వస్తుంది. అలాగే కుండీ పెద్దగా ఉండాలి.
Image credits: social media
మనీ ప్లాంట్
ఒకవేళ మీరు మనీ ప్లాంట్ ను ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మార్చాలనుకుంటే వాటి మూలాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడండి.
Image credits: Getty
మనీ ప్లాంట్
మనీ ప్లాంట్ ను ఎక్కడా పెట్టినా దానికి సూర్యరశ్మి తగిలేలా ఉండాలి. అంటే దీన్ని బాల్కనీ లేదా కిటికీ దగ్గర పెట్టొచ్చన్న మాట.
Image credits: social media
నీళ్లు పోయాలి
మనీ ప్లాంట్ ఆరోగ్యంగా పెరగాలంటే కుండీలో ఉన్న మట్టి మొత్తం తడిసేలా నీళ్లు పోయాలి. అలాగే మట్టి ఎండినట్టుగా కనిపిస్తే వాటర్ ను పోయండి.
Image credits: social media
మనీ ప్లాంట్
ఈ మొక్క కాండం ఎక్కువగా పెరిగితే వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండండి. వాటికి పట్టిన దుమ్మును తొలగించి తడి గుడ్డతో వాటిని శుభ్రం చేయండి.
Image credits: social media
మనీ ప్లాంట్
వాటర్ లో పెంచే మనీ ప్లాంట్ ను ఎప్పుడూ తడిగానే ఉండాలి. వాతావరణాన్ని బట్టి, మొక్క ఎదుగుదలను బట్టి నీళ్లను పోస్తూ ఉండాలి.