Lifestyle

గింజలు

విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్న గింజలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి.
 

Image credits: Getty

పప్పు

పప్పుల్లో ప్రోటీన్, ఫైబర్ మొదలైనవి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇలాంటి చిక్కుళ్లను తింటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 

Image credits: Getty

బెర్రీలు

విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బెర్రీలను తింటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండెపోటు ముప్పు కూడా ఉండదు. 
 

Image credits: Getty

బచ్చలికూర

విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, పొటాషియం, కాల్షియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్స్ పుష్కలంగా ఉండే పాలకూరను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 

Image credits: Getty

అవొకాడో

ఆరోగ్యకరమైన కొవ్వులు, రకరకాల విటమిన్లు ఉండే అవొకాడోలను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 

Image credits: Getty

టమాటాలు

టమాటాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ కె  పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటుగా గుండెను కాపాడుతుంది.
 

Image credits: Getty

ఆలివ్ ఆయిల్

ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ఆలివ్ ఆయిల్ లో పుష్కలంగా ఉంటాయి. ఈ నూనెను మీ డైట్ లో భాగం చేసుకుంటే మీ గుండెకు ఏ ఢోకా ఉండదు. 
 

Image credits: Getty

సూచన

ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చండి.

Image credits: Getty
Find Next One