టీ ట్రీ ఆయిల్ కూడా శరీర దుర్వాసనను పోగొట్టడానికి సహాయపడుతుంది. ఇందుకోసం కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ ను తీసుకుని నీటిలో కలిపి డియోడరెంట్ గా ఉపయోగించండి.
life Oct 30 2023
Author: R Shivallela Image Credits:Getty
Telugu
కలబంద జెల్
అలోవెరా జెల్ కూడా చెమట, శరీర దుర్వాసను తగ్గిస్తుంది. ఇందుకోసం చంకల్లో కొద్దిగా కలబంద జెల్ ను అప్లై చేయండి.
Image credits: Getty
Telugu
టీ బ్యాగ్
వాడిన గ్రీన్ టీ బ్యాగ్ ను ఉపయోగించి దుర్వాసన రాకుండా చేయొచ్చు. ఇందుకోసం వాడిన గ్రీన్ టీ బ్యాగ్ ను చల్లార్చి చంకలపై కాసేపు ఉంచాలి, గ్రీన్ టీలో ఉండే టానిన్ దుర్వాసనను పోగొడుతుంది.
Image credits: Getty
Telugu
నారింజ
సిట్రస్ పండ్లైన నిమ్మకాయ లేదా నారింజ ముక్కను తీసుకుని మీ చంకల్లో రుద్దండి. ఇది కూడా శరీరం దుర్వాసన, చంకల్లోని చెమట వాసనను పోగొడుతుంది.
Image credits: Getty
Telugu
ఎప్సమ్ ఉప్పు
శరీర దుర్వాసను వదిలించుకోవడానికి మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా ఎప్సమ్ ఉప్పు ను కలపండి. ఇది మీ నుంచి చెమట వాసన రాకుండా చేస్తుంది.
Image credits: Getty
Telugu
హెర్బల్ టీ
హెర్బల్ టీతో కూడా శరీర దుర్వాసను తగ్గించుకోవచ్చు. అందుకోసం స్నానం చేసే నీటిలో రోజ్మేరీ, లావెండర్ వంటి మూలికా టీలను జోడించండి.
Image credits: Getty
Telugu
టెస్టింగ్
ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ శరీరం నుంచి దుర్వాసన వస్తూ ఉంటే ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లి చెకప్ లు చేయించుకోండి. కొన్ని సమస్యల వల్ల కూడా శరీరం నుంచి దుర్వాసన వస్తుంది.