Lifestyle

పండ్లు

చర్మ సంరక్షణలో ఆహారం పోషించే పాత్ర ఎనలేనిది. అయితే కొన్ని రకాల పండ్లు మన చర్మ సమస్యలను తగ్గించడానికి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. 
 

Image credits: Getty

చర్మ సంరక్షణ

పండ్లు విటమిన్లకు,  ఖనిజాలకు ఒక గొప్ప వనరు. ఇవి మన చర్మానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. అవేం పండ్లంటే? 
 

Image credits: our own

బెర్రీలు

బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, కోరిందకాయలు వంటి అన్ని రకాల బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని రక్షిస్తాయి.

Image credits: our own

నారింజ

నారింజ, ద్రాక్ష పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఈ పండ్లను తింటే చర్మం యవ్వనంగా ఉంటుంది.
 

Image credits: our own

బొప్పాయి

బొప్పాయి కూడా చర్మానికి మంచి మేలు చేస్తుంది. ఈ పండులో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. బొప్పాయిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి చర్మం కాంతివంతంగా ఉంటుంది.
 

Image credits: our own

అవొకాడో

అవొకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు మెండుగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల లోపలి నుంచి చర్మాన్ని తేమగా ఉంటుంది. దీంతో మీ చర్మం గ్లో అవుతుంది.

Image credits: our own

కివీ

కివి పండులో విటమిన్ ఇ, విటమిన్ కె లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ రెండు పోషకాలు మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. 
 

Image credits: our own
Find Next One