Lifestyle

పొడిబారిన పెదాలు

చలికాలంలో పెదవులు పొడిబారి పగుళ్లు వస్తుంటాయి. ఇది ఈ సీజన్ లో సర్వసాధారణ సమస్య. అయితే కొంతమంది పొడిబారకుండా ఉండేందుకు నాలుకతో పెదాలను తడుపుతూ ఉంటారు. 
 

Image credits: Getty

చిట్కాలు

పొడిబారిన పెదవులు పగుళ్లు రాకుండా ఉండటానికి  కొన్ని చిట్కాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Image credits: google

చక్కెర

పంచదార పెదాల పగుళ్లను దూరం చేయడానికి సహాయపడుతుంది. ఇందుకోసం చక్కెరను కొంచెం బరకగా చేసి పెదవులకు అప్లై చేసి మసాజ్ చేయాలి. దీనివల్ల పగుళ్లు ఏర్పడవు. 
 

Image credits: google

నారింజ

సిట్రస్ పండ్లైన నారింజ, నిమ్మలు కూడా పెదాల పగుళ్లను తగ్గిస్తాయి. ఇందుకోసం నారింజ రసం, బాదం నూనెను కలిపి పెదవులకు రాసుకుంటే పొడిబారడం తగ్గుతుంది. 
 

Image credits: google

పాలపొడి

పాల పొడి కూడా పెదవుల పగుళ్లను దూరంచేస్తుంది. ఇందుకోసం పాలపొడిని పెదవులకు అప్లై చేయాలి. ఇది చర్మం విచ్ఛిన్నం కాకుండా నిరోధిస్తుంది. 

 

Image credits: google

అలో వెరా జెల్

రాత్రి పడుకునే ముందు కొద్దిగా కలబంద జెల్ ను పెదవులకు అప్లై చేయండి. దీనివల్ల మీ పెదవులు పొడిబారే సమస్యే ఉండదు. 
 

Image credits: Getty

తేనె

తేనె నేచురల్ మాయిశ్చరైజర్ లా కూడా పనిచేస్తుంది. అందుకే తేనె పొడి పెదాలను నివారించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

Image credits: Getty

ఈ కూరగాయలు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తయ్

దాల్చిన చెక్కతో ఇన్ని లాభాలా?

రోజూ ఆలుగడ్డ తింటున్నరా?

బార్లీ వాటర్ తో ఈ సమస్యలన్నీ మాయం