Lifestyle
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్లే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
రకరకాల కూరగాయల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు కొన్ని రకాల కూరగాయలు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
బీట్ రూట్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. నిపుణుల ప్రకారం.. బీట్ రూట్ ను తింటే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది.
చిలగడదుంపలు మంచి పోషకాహారం. వీటిని తింటే కొలెస్ట్రాల్ ను తగ్గడమే కాకుండా రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడతాయి.
క్యాబేజీలో కరగని ఫైబర్స్, పొటాషియం మెండుగా ఉంటాయి. ఈ రెండు పోషఖాలు మీ రక్తపోటును నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.
క్యారెట్లలో విటమిన్లు, ఖనిజాలు, విటమిన్లు, కరిగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి.
బెండకాయలో పెక్టిన్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది.