Weight Loss Drink: బాడీలో కొవ్వును ఇట్టే తగ్గించే మ్యాజిక్ డ్రింక్
life Jul 13 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
శరీరంలో కొవ్వు కరిగించే 6 రకాల పానీయాలు
గ్రీన్ టీలో కెటెచిన్స్, కెఫీన్ ఉంటాయి. ఇవి జీవక్రియను వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా వ్యాయామం చేసేటప్పుడు శరీరంలోని కొవ్వును వేగంగా కరిగించడానికి ఇవి బాగా సాయపడతాయి.
Image credits: Getty
Telugu
బ్లాక్ కాఫీ
బ్లాక్ కాఫీలో కేలరీలు చాలా తక్కువ. ఇందులో ఉండే కెఫీన్, ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల ఎక్కువగా తినాలనే కోరిక కంట్రోల్ అవుతుంది.
Image credits: Getty
Telugu
అల్లం నీళ్లు
అల్లం నీళ్లు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. అదే సమయంలో ఆకలి కూడా తగ్గుతుంది. ఈ రెండు కారణాల వల్ల బరువు తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
Image credits: Getty
Telugu
జీలకర్ర నీళ్లు
జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కడుపు ఉబ్బరం తగ్గించడానికి జీలకర్ర నీళ్లు బాగా పనిచేస్తాయి. ఒక టీస్పూన్ జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తాగాలి.
Image credits: Sandook
Telugu
చియా సీడ్స్ నీళ్లు
చియా సీడ్స్‌లో ఫైబర్ (పీచుపదార్థం) ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇవి తాగితే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుంది.
Image credits: Asianet News
Telugu
దాల్చిన చెక్క నీళ్లు
దాల్చిన చెక్క నీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే, అనవసరమైన తిండిపై కోరికలు (Cravings) తగ్గుతాయి. ఇలా బరువు తగ్గడానికి ఇది సాయపడుతుంది.