Ants Removal: ఇంట్లో ఇదొక్కటి ఉంటే అసలు చీమలే రావు
life May 07 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
ఈ చిట్కాతో చీమలకు చెక్
ఇంట్లో ఒక్క చీమ కనిపిస్తే చాలు..దాని వెనుక మరిన్ని చీమలు దారి కట్టేస్తాయి. ముఖ్యంగా వంటగదిలో..ఏ వస్తువు పెట్టినా వాటి చుట్టూ చేరుతాయి. ఈ చిట్కాలు పాటిస్తే చీమలు ఎప్పటికీ రావు
Image credits: Getty
Telugu
దాల్చిన చెక్క పొడి
చీమలు ఎక్కువగా కనిపించే చోట కొద్దిగా దాల్చిన చెక్క పొడి చల్లండి. ముఖ్యంగా తలుపుల మూలలు, కిటికీలు, అలమారాల్లో చల్లితే మంచి ఫలితం ఉంటుంది.
Image credits: Getty
Telugu
నిమ్మకాయ
చీమలు ఇంట్లోకి వచ్చే దారుల్లో నిమ్మరసం పిండండి. లేదా నిమ్మ తొక్కలను అక్కడ ఉంచినా చాలు. చీమలు ఆ వాసనకు రాకుండా పోతాయి.
Image credits: pinterest
Telugu
ఉప్పు
చీమలు తిరిగే ప్రదేశాల్లో ఉప్పు చల్లడం మంచిది. అలాగే నీటిలో ఉప్పు కలిపి స్ప్రే చేసినా చీమల బెడద తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
ఎండు మిరపకాయలు
ఎండు మిరపకాయలను దంచి, చీమలు వచ్చే చోట చల్లండి. ఆ ఘాటుకు చీమలు వెంటనే పారిపోతాయి.
Image credits: Getty
Telugu
చాక్‌పీస్
చీమలు వెళ్లే దారిలో చాక్‌పీస్‌తో ఒక గీత గీయండి. ఇది వాటి దారికి అడ్డుకట్ట వేస్తుంది. చాక్‌లోని కాల్షియం కార్బొనేట్ చీమలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
వెనిగర్
నీళ్లు, వైట్ వెనిగర్‌ను సమాన పరిమాణంలో తీసుకోండి. ఈ మిశ్రమాన్ని చీమలు తిరిగే దారుల్లో స్ప్రే చేస్తే అవి రాకుండా ఉంటాయి.