వంట చేసేటప్పుడు పాత్రపై మూత సరిగ్గా పెట్టాలి. దీనివల్ల వేడి సరిగ్గా అంది, ఆహారం త్వరగా ఉడుకుతుంది.
బర్నర్‌కు సరిపోయే పాత్రను ఎంచుకోవాలి. చిన్న బర్నర్‌పై పెద్ద పాత్ర పెట్టడం మానేయాలి.
బీన్స్, పప్పులు, బియ్యం వంటివాటిని వండే ముందు నీటిలో నానబెట్టడం మంచిది. దానివల్ల త్వరగా ఉడుకుతాయి.
బర్నర్లపై మురికి చేరితే గ్యాస్ రాకుండా అడ్డుపడుతుంది. వంటకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి బర్నర్లను తరచూ శుభ్రం చేయాలి.
ప్రెషర్ కుక్కర్ వాడితే వంట సులభం అవుతుంది. ఫలితంగా గ్యాస్ కూడా ఆదా అవుతుంది.
ఆహార పదార్థాలను ఎప్పుడూ చిన్న మంటపై ఉడికించాలి. దానివల్ల గ్యాస్ వృథా కాదు. ఆహారం బాగా ఉడుకుతుంది.
అదిరిపోయే బ్లూ బ్రైడల్ లెహంగాలు
పదివేలలో డైమండ్ ముక్కు పుడకలు
పాదాల అందాన్ని పెంచే ముత్యాల పట్టీలు
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం