Money Plant:మనీ ప్లాంట్ బాగా పెరగాలా? ఈ నీళ్లు పోసినా చాలు
gardening Mar 21 2026
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
మీ కిచెన్ లోనే ఎరువులు..
మీ ఇంట్లో మనీ ప్లాంట్ గుబురుగా పెరగాలంటే.. ఖరీదైన ఎరువులతో పని లేదు. మీ కిచెన్ లో లభించే కొన్నింటిని వేసినా చాలు.
Image credits: Getty
Telugu
కాఫీ పొడి నీళ్లు
కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మనీ ప్లాంట్ పెరుగుదలను వేగవంతం చేస్తాయి. లీటర్ నీటిలో ఒక చెంచా కాఫీ పొడి కలిపి మొక్క మొదట్లో పోయాలి.10 రోజులకి ఒకసారి పోసినా మొక్క వేగంగా పెరుగుతుంది.
Image credits: Instagram
Telugu
వంట సోడా నీళ్లు
వంట సోడా కలిపిన నీటిని పోయడం వల్ల మొక్క వేర్లకు బలం చేకూరుతుంది. ఒక మగ్గు నీటిలో ఒక చెంచా వంట సోడా కలిపి మొక్క మొదట్లో పోయండి. కొద్ది రోజుల్లోనే కొత్త ఆకులు రావడం గమనిస్తారు.
Image credits: Getty
Telugu
పసుపు నీళ్లు
మొక్క వేర్లకు ఫంగస్ సోకితే పెరుగుదల ఆగిపోతుంది. పసుపు సహజ ఔషధంగా పనిచేస్తుంది. పసుపు కలిపిన నీటిని పోయడం వల్ల ఫంగస్, ఇతర క్రిములు నశించి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
ఎప్సమ్ సాల్ట్
ఎప్సమ్ సాల్ట్ మొక్కలకు ఒక మంచి టానిక్‌లా పనిచేస్తుంది. దీన్ని నీటిలో కలిపి మొక్క మొదట్లో పోయాలి. దీనితో పాటు మట్టిని కొద్దిగా గుల్లబరచి, వర్మీకంపోస్ట్ ఎరువు వేస్తే చాలు.
Image credits: Pinterest
Telugu
టీ పొడి వాడకం
మనీ ప్లాంట్‌కు టీ పొడి ఒక మంచి సేంద్రియ ఎరువు. టీ పెట్టాక మిగిలిన పొడిని కడిగి మొక్క మొదట్లో వేయొచ్చు. లేదా టీ పొడి కలిపిన నీటినైనా పోయొచ్చు. ఇది మొక్కను ఎప్పుడూ పచ్చగా ఉంచుతుంది.
Image credits: Social Media
Telugu
నీళ్లు ఎక్కువగా వద్దు
మనీ ప్లాంట్‌కు ఎక్కువ నీళ్లు పోయకూడదు. సరైన సూర్యరశ్మి, పైన చెప్పిన పోషకాలు అందిస్తే చాలు.. మీ ఇంట్లోని మనీ ప్లాంట్ చాలా తక్కువ టైంలోనే గుబురుగా పెరుగుతుంది.