నిమ్మరసంలో ఉండే బ్లీచింగ్ గుణాలు ట్యాన్‌ను పోగొడతాయి. తేనె ఏమో చర్మానికి కావాల్సిన తేమను అందించి, మృదువుగా మారుస్తుంది.
పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మృతకణాలను తొలగిస్తుంది. పసుపు చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. ఈ రెండింటి మిశ్రమం మంచి ఫలితాన్నిస్తుంది.
కొద్దిగా పాలు, శనగపిండి కలిపి చేతులకు ప్యాక్‌లా వేసుకోవాలి. ఇది ట్యాన్‌ను తొలగించడమే కాకుండా, చర్మాన్ని మృదువుగా మార్చడానికి బాగా పనిచేస్తుంది.
రాత్రి పడుకునే ముందు చేతులకు కలబంద గుజ్జును రాయాలి. ఇది ఎండ వల్ల కలిగే చికాకును తగ్గించి, చర్మం రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
బొప్పాయిలో 'పపైన్' అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మంపై ఉన్న నలుపును చాలా వేగంగా తొలగించగలదు. తేనెతో కలిపి వాడితే ఇంకా మంచిది.
టమాటాలో ఉండే 'లైకోపీన్' చర్మంపై నలుపును తగ్గించి, సూర్యరశ్మి నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది ఒకరకంగా మనకు నాచురల్ సన్‌స్క్రీన్ లాంటిది.
బంగాళదుంప రసం ఒక సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. చేతులపై ఉండే నల్ల మచ్చలను తొలగించడానికి ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
Silver Anklets: పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు
Bentex Bangles: బంగారానికి ఏ మాత్రం తీసిపోని బెంటెక్స్ గాజులు
Face Glow: వేడి నీళ్లా? చల్లటి నీళ్లా? చర్మ సౌందర్యానికి ఏది మంచిది?
Summer Fashion: ఇంట్లో వేసుకోవడానికి బెస్ట్ కాటన్ కుర్తీలు ఇవిగో!