Face Glow: వేడి నీళ్లా? చల్లటి నీళ్లా? చర్మ సౌందర్యానికి ఏది మంచిది?
life Apr 23 2026
Author: ramya Sridhar Image Credits:Asianet News
Telugu
వేడి నీళ్లతో స్నానం చేయచ్చా?
వేడి ఎక్కువగా ఉన్న నీటితో స్నానం చేస్తే చర్మంపై ఉండే సహజ నూనెలు పోతాయి. దీని వల్ల చర్మం తేమ కోల్పోయి… పొడిగా మారిపోతుంది.
Image credits: Asianet News
Telugu
చల్లని నీళ్లతో ప్రయోజనాలు
చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంటే చర్మంపై వాపు తగ్గుతుంది. ఉదయాన్నే ముఖం ఉబ్బినట్లు అనిపిస్తే ఇది మంచి చిట్కా. ముఖానికి తక్షణ నిగారింపు కూడా వస్తుంది.
Image credits: Asianet News
Telugu
రంధ్రాలు శుభ్రపడాలంటే గోరువెచ్చని నీళ్లు
ముఖంపై చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మురికి, జిడ్డును తొలగించడానికి గోరువెచ్చని నీళ్లు బాగా పనిచేస్తాయి. ఇవి రంధ్రాలు తెరుచుకునేలా చేసి శుభ్రపరుస్తాయి.
Image credits: Asianet News
Telugu
తేమను కాపాడుకోవాలంటే..
చల్లని నీళ్లు చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. తద్వారా చర్మం సాగిపోకుండా, దాని ఎలాస్టిసిటీ (స్థితిస్థాపకత) దెబ్బతినకుండా కాపాడతాయి.
Image credits: Asianet News
Telugu
మొటిమలు ఉన్నవాళ్లు జాగ్రత్త
మొటిమల సమస్య ఉన్నవాళ్లు మరీ వేడి నీళ్లు వాడితే చర్మంపై ఇరిటేషన్ పెరిగే ప్రమాదం ఉంది. వీళ్లకు గోరువెచ్చని నీళ్లే ఉత్తమం.
Image credits: Asianet News
Telugu
స్నానానికి ఏ నీళ్లు కరెక్ట్?
శరీరానికి హాయిగా అనిపించడానికి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం మంచిదే. కానీ, స్నానం ముగించే ముందు ఒంటిపై కాస్త చల్లని నీళ్లు పోసుకోవాలి. ఇది చర్మాన్ని కాపాడుతుంది.
Image credits: Asianet News
Telugu
వాతావరణాన్ని బట్టి మార్చుకోవాలి
వాతావరణాన్ని బట్టి కూడా నీటిని ఎంచుకోవాలి. వేసవిలో చల్లని నీళ్లు, చలికాలంలో గోరువెచ్చని నీళ్లు వాడటం వల్ల చర్మం తన బ్యాలెన్స్‌ను కోల్పోకుండా ఉంటుంది.