ఐస్ క్యూబ్ తో కళ్ల చుట్టూ మసాజ్ చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి.
కలబంద జెల్ కళ్ల చుట్టూ రాసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది నల్లటి వలయాలు తొలగించడానికి సహాయపడుతుంది.
దోసకాయ ముక్కలను కళ్లపై 15 నిమిషాలు ఉంచి తీసివేయాలి. ఇది కళ్లకు చలువ చేస్తుంది. డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి.
ఒక చెంచా టమాటా రసం, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి కళ్ల కింద రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది డార్క్ సర్కిల్స్ తొలగించడానికి సహాయపడుతుంది.
కొంచెం కాటన్ ని రోజ్ వాటర్లో ముంచి కళ్ల చుట్టు రాసుకోవాలి. ఇది నల్లటి వలయాలు తొలగించడానికి సహాయపడుతుంది.
కాచి చల్లార్చిన పాలు పత్తిలో ముంచి కళ్ల చుట్టు రాసుకోవాలి. 10 నిమిషాలు ఉంచి కడిగేయాలి.