మొండి మరకలు పట్టిన స్టీల్ గిన్నెల్ని ఎంత తోమినా వదలట్లేదా? కొన్ని సింపుల్ చిట్కాలతో వాటిని కొత్తవాటిలా మెరిపించవచ్చు. ఆ పద్ధతులేంటో చూద్దాం.
life Apr 04 2026
Author: Nandini Arava Image Credits:AI Meta
Telugu
వేడి నీళ్లు
ఆహారం మాడిపోయి గిన్నెలకు అంటుకుందా? ఆ పాత్రలను కడిగే ముందు, ఓ 10 నిమిషాల పాటు వేడి నీటిలో నానబెట్టండి. ఇలా చేస్తే జిడ్డు, మరకలు సులువుగా పోతాయి.
Image credits: AI Meta
Telugu
వంట సోడా
స్టెయిన్‌లెస్ స్టీల్ గిన్నెలపై గోధుమ రంగు మరకలు ఉన్నాయా? వాటిని వంట సోడాతో శుభ్రం చేయండి. గిన్నెపై వంట సోడాను పూసి, 10 నిమిషాల తర్వాత కడిగితే మరకలు మాయమవుతాయి.
Image credits: AI Meta
Telugu
వెనిగర్
గిన్నెలపై నల్లటి మచ్చలను తొలగించడానికి వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గిన్నెడు నీటిలో 1 టీస్పూన్ వెనిగర్ కలిపి, ఆ నీటితో పాత్రలను కడగండి. దీంతో గిన్నెలు కొత్తవాటిలా మెరుస్తాయి.
Image credits: AI Meta
Telugu
నిమ్మరసం
ఒక గిన్నెలో రెండు చెంచాల వంట సోడా తీసుకుని, అందులో నిమ్మరసం పిండండి. ఈ పేస్ట్‌ను గిన్నెలపై రాసి రుద్దితే, ఎంతటి మొండి మరకలైనా సులభంగా వదిలిపోతాయి.